Pushpa 2: పొట్టపై బన్నీ లుక్‌.. గంగమ్మ పాటకు మాస్‌ డ్యాన్స్‌.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

by Kavitha |   ( Updated:2024-12-11 05:41:19.0  )
Pushpa 2: పొట్టపై బన్నీ లుక్‌.. గంగమ్మ పాటకు మాస్‌ డ్యాన్స్‌.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అయితే ‘పుష్ప 2’(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 922 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక పుష్ప 2 జోరు చూస్తుంటే ఒక‌టి లేదా రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలై ఐదు రోజులు దాటినా.. ఇప్పటికీ థియేటర్స్ వద్ద సందడి కొనసాగుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకా పుష్ప సెలబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కేరళ(Kerala)కు చెందిన ఓ అభిమాని.. తన పొట్టపై ఐకాన్ స్టార్ గంగమ్మ తల్లి వేషాధారణలో ఉన్న లుక్‌ని డ్రాయింగ్ చేయించుకుని థియేటర్స్‌ దగ్గర నిలబడి డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. కాగా ఐకాన్ స్టార్‌ని కేరళలో ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు అన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story