- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వల్ల 100 కోట్లు నష్టపోయానంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ (ట్వీట్)

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా మేకర్స్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. అయితే కొంతమంది ఎక్కువ బడ్జెట్‌తో చిత్రాలు తెరకెక్కించినప్పటికీ ఫలితం దక్కదు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంటాయి. అయినప్పటికీ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు బాధపడకుండా మూవీస్ చేస్తూనే ఉంటారు. నష్టాల పాలైనప్పటికీ కొంతమంది బయటకు చెప్పరు. కానీ ఓ నిర్మాత తనకు 100 కోట్ల వరకు లాస్ అయినట్లు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పట్లోనే భారీగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నిర్మాత శింగనమల రమేష్ బాబు(Ramesh Babu) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
2010లో కొమురం పులి, ఖలేజా వంటి చిత్రాలు తెరకెక్కించారు. అయితే ఈ రెండు మూవీస్ డిజాస్టర్ కావడంతో నష్టాలు వచ్చాయి. ఇక దీనిపై రియాక్ట్ అవుతూ ‘‘ఈ మధ్య శంకర్, రాజమౌళి(Rajamouli) సినిమాల ప్రొడక్షన్ కోసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. రీసెంట్‌గా 'పుష్ప 2' మూవీ కూడా మూడేళ్లు తీశారు. కానీ నేను నిర్మాణంలో ఉన్న రోజుల్లో మూడేళ్ళ సినిమా అనే టాపిక్‌యే లేదు. ఆరు నెలల నుంచి ఏడాది లోపే సినిమాలు పూర్తయ్యేవి. కానీ నా ఫేట్, బ్యాడ్ లక్ అంతే.. 'కొమురం పులి'(Komuram puli), 'ఖలేజా' సినిమాలకి మూడు ఏళ్లు టైం పట్టింది.
మూడేళ్లకి మెయింటనెన్స్, ప్రొడక్షన్ ఖర్చు, ఆఫీసు ఖర్చు, జీతాలు ఇలా ఎన్ని ఉంటాయనేది ఒక ప్రొడ్యూసర్ కే తెలుస్తుంది. ఈ రెండు చిత్రాల వల్ల నాకు రూ.100 కోట్ల నష్టం వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ట్విట్టర్ ద్వారా స్పందించి కౌంటర్ వేశారు. ‘‘సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు’’ అని రాసుకొచ్చారు.
సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం @PawanKalyan గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు . https://t.co/LVGihOWIhI
— BANDLA GANESH. (@ganeshbandla) February 5, 2025