- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయుండి సెట్‌లో అలా చేస్తాడనుకోలేదు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) బాహుబలి-1, బాహుబలి-2 వంటి చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ ‘ఆది పురుష్’(Adhi Purush) సినిమాతో భారీ డిజాస్టర్‌ను చవిచూశారు. ఆ తర్వాత సలార్, కల్కి వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ సాధించారు. ప్రస్తుతం ‘రాజాసాబ్’(Rajasab)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) విలన్‌గా కనిపించనున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో.. మాళవిక మోహనన్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది. తాజాగా, మాళవిక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘రాజాసాబ్ సెట్‌లో ప్రభాస్ ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. అంత పెద్ద స్టార్ హీరో అయిండి అలా చేస్తారని ఊహించలేదు. అంత పెద్ద స్టార్ నార్మల్‌గా, సపోర్టివ్‌గా ఉండటం సెట్‌లో అందరితో కలిసిపోవడం చూసి నేను షాక్ అయ్యాను. సెట్‌లో ఆయన సరదాగా ఉంటారు. అందరికీ మంచి భోజనం అందిందా లేదా అని తెలుసుకుంటారు.
అంతేకాకుండా బిర్యానీ దగ్గరుండి మరీ తినిపించడం వంటివి చేస్తారు. నిజంగా ఆయన చాలా స్వీట్. ఆయనతో వర్క్ చేసే వారికి అరుదైన వంటకాలతో ట్రీట్ ఇస్తారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ తెలుసుకున్న అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ తనతో వర్క్ చేస్తున్న వారికి ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ఇక సీక్వెల్స్‌పై ఫోకస్ నెట్టిన డార్లింగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు.