రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అలా ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న యాక్టర్ సప్తగిరి కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-13 03:10:41.0  )
రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అలా ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న యాక్టర్ సప్తగిరి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఈశ్వర్’(Eshwar) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘వర్షం’(Varsham) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) సినిమాతో మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లు కూడా రాబట్టింది. ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దీపిక పదుకొణె(Deepika Padukone), కీర్తి సురేష్(Keerthi Suresh), దిశా పటానీ(Disha Patani) కీ రోల్ ప్లే చేశారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘రాజా సాబ్’(Raja Saab) ఒకటి. మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతుంది. ఇక ఈ మూవీలో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్‌(Riddi Kumar)లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ ఖేర్(Anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్(Taman) సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఫస్ట్ టైం ప్రభాస్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో మన ముందుకు రాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ క్రమంలో కమెడియన్ సప్తగిరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘రాజాసాబ్ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది.

ఇప్పటి వరకు ఏ మూవీలో లేని విధంగా ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన చేసిన కామెడీకి మేమందరం కింద పడి దొర్లుతూ నవ్వాం’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సప్తగిరి(Sapthagiri) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Read More..

ఇన్నర్ పార్ట్ కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. నీ యవ్వ తగ్గేదేలే అంటున్న నెటిజన్లు

Next Story