- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉప్పు, కారం ఎవ్రిథింగ్ నైస్ అంటూ స్పైసీ ఫొటోలు షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Tamanna) మనందరికీ సుపరిచితమే. ‘శ్రీ’(Sri) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ పక్కా ఐటెమ్ సాంగ్స్‌తో మరో పక్కా లీడ్ రోల్ ప్లే చేస్తూ సినిమాలు చేస్తున్నది. అలా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ ‘ఓదెల-2’(Odela-2).ఇది ‘ఓదెల రైల్వే స్టేషన్’(Odela Railway Station)కు సీక్వెల్‌గా వస్తుంది.
రీసెంట్‌గా ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma)తో పీకల్లోతు ప్రేమలో ఉన్నది. అయితే రీసెంట్‌గా ఈ జంటకు బ్రేకప్ అయినట్ల సమాచారం. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ డ్రెస్ వేసుకుని అచ్చం కాకీ థీమ్‌లో ఉన్న డ్రెస్‌ను వేసుకుంది. ఇక ఆ స్పైసీ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. తీపి, కారం, ఎవ్రిథింగ్ నైస్ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ బ్లాక్ ఇన్ వైట్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడు పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
Read More..
నాకు కోపం వస్తే ఇప్పటికీ అలా చేస్తాను.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్