Dhanush: ‘ఇడ్లీ కడై’ మూవీలో పవర్ పాక్డ్‌ నటుడు.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Hamsa |
Dhanush: ‘ఇడ్లీ కడై’ మూవీలో పవర్ పాక్డ్‌ నటుడు.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’(Idli Kadai). ఇందులో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆకాశ్(Akash) నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్(Sathyaraj), రాజ్‌కిరణ్(Rajkiran) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే భారీ అంచనాల మధ్య ‘ఇడ్లీ కడై’ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రానుంది. తాజాగా, ఈ సినిమాలో పవర్ పాక్డ్‌ నటుడు నటిస్తున్నట్లు ధనుష్ ఎక్స్ ద్వారా ప్రకటించారు.

‘ఇడ్లీ కడై’ లో అరుణ్ విజయ్(Arun Vijay) కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ధనుష్ చేతిలో ప్లాస్క్ పట్టుకుని కనిపించగా.. అరుణ్ బాక్సింగ్ గ్లౌజ్‌లు పెట్టుకుని సీరియస్‌గా ఉన్నాడు. అయితే అరుణ్ ఏ పాత్రలో నటిస్తున్నాడో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా, ఈ సినిమా ధనుష్, నిత్యామీనన్ కాంబోలో రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Next Story

Most Viewed