Pooja Hegde: ఆ మూవీలో ఆ సీన్స్‌ బాగా చేయడం వల్లే ‘రెట్రో’లో చాన్స్ వచ్చింది.. బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
Pooja Hegde: ఆ మూవీలో ఆ సీన్స్‌ బాగా చేయడం వల్లే ‘రెట్రో’లో చాన్స్ వచ్చింది.. బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నాగ చైతన్య(NAGA CHAITANYA) సరసన ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో తన నటనతో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో పాటు ఐరన్ లెగ్ బిరుదు తెచ్చుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే ఒకటి రెండు సినిమాల్లో కాదండోయ్ దాదాపు 6 సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో ‘దేవా’(Deva), ‘రెట్రో’(Retro), ‘జన నాయగన్’(Jana Nayagan), దుల్కర్ సల్మాన్(Dulquer Salman) సరసన ఓ మూవీ అలా మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవా’. ఈ సినిమా జనవరి 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది.

అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘రెట్రోలో నేను విభిన్నమైన పాత్ర పోషించా. ఈ రోల్ దక్కడానికి కారణం గతంలో నేను నటించిన ‘రాధేశ్యామ్’(Radhe Shyam) మూవీ. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుకు అందులోని నా ఎమోషనల్ సీన్స్ నచ్చాయి. రెట్రోలోనూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో నన్ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా రెట్రో మూవీని సూర్య(Surya) హీరోగా కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) తెరకెక్కిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.



Next Story

Most Viewed