Meenakshi Chowdhury: దయచేసి ఆఫర్ల కోసం అలా చేయకండి.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2025-02-20 10:13:17.0  )
Meenakshi Chowdhury: దయచేసి ఆఫర్ల కోసం అలా చేయకండి.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) వరుస చిత్రాల్లో నటిస్తూ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఇటీవల లక్కీ భాస్కర్(Lucky Bhaskar), సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam), సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు తన అందం, అభినయంతో వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఇండస్ట్రీకి రావాలనుకునే యువతులను నేను ఇచ్చే సలహా ఇదే. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. మీరు కెరీర్‌లో ముందుకెళ్లాలనుకొనే సమయంలో ఆఫర్ల కోసం లొంగిపోకూడదు.

మీ ఒరిజినాలిటీ మిస్ కాకుండా ఉండాలి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇండస్ట్రీలో ఎదుగాలనే ప్రయత్నంలో మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండాలి. పరిస్థితులకనుగుణంగా మారితో మీ వ్యక్తిత్వం దెబ్బ తింటుంది. సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం మనగడ సాధించాలంటే.. మీ పర్సనాలిటీని చంపుకోవద్దు. మనం ఒక విషయాన్ని బలంగా నమ్ముతాం. దానిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. హీరోయిన్ల అనగాన రకరకాల అభిప్రాయాలు, అంచనాలు ఉంటాయి. వాటి కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణాది హీరోయిన్లంటే లావుగా ఉంటారనే అపోహాలు ఉంటాయి. అలాంటి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండాలి. బాలీవుడ్‌లో ఒకప్పుడు కొన్ని పరిమితులు, ఆంక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటివి లేవు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story