- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పుష్పా-2 షోలో కలకలం.. పెప్పర్ స్ప్రేతో హల్ చల్ చేసిన యువకుడు

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) నటించిన పుష్పా-2 చిత్రం(Pushpa-2 movie) విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. పాన్ ఇండియా(Pan India) లెవల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. దీంతో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినియాలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు పునకాలతో ఊగిపోతున్నారు.
అయితే ముంబై గెలాక్సీ థియేటర్(Mumbai Galaxy Theatre)లో ఓ యువకుడు కలకలం సృష్టించారు. ప్రేక్షకులు సినిమాలో లీనమై పోయిన వేళ హల్ చల్ చేశారు. ఒక్కసారిగా పెప్పర్ స్ప్రె(Pepper Spray) బయటకు తీసి ఆడియన్స్పై చల్లారు. దీంతో అందరూ ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. అసలు ఏం జరగుతుందో అర్ధంకాక చాలా మంది ప్రేక్షకులు బెదిరిపోయారు. థియేటర్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. చివరకు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు.
Read More...
Pushpa-2: అల్లు అర్జున్ సినిమా నుంచి జాతర లిరికల్ సాంగ్ విడుదల