పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. బేబీ బంప్‌తో దర్శనమివ్వడంతో అంతా షాక్! (పోస్ట్)

by Hamsa |
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. బేబీ బంప్‌తో దర్శనమివ్వడంతో అంతా షాక్! (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్(Amisha Patel) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె ‘దిల్ తో పాగల్ హై’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్(Akshay Kumar), అజయ్ దేవ్‌గణ్ వంటి వారితో నటించి మెప్పించింది. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘బద్రి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. తన అందం, నటనతో అందరినీ ఫిదా అయ్యేలా చేసింది. ఇక తెలుగులో ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్ వంటి స్టార్స్ సరసన నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమె అడపా దడపా సినిమాలు చేస్తోంది. 2023లో ‘గదర్-2’ మూవీతో హిట్ అందుకున్న ఆమె అదే ఫామ్‌లో గత ఏడాది ‘తౌబా తేరా జల్వా’ సినిమాతో వచ్చింది.

గత కొద్ది రోజుల నుంచి చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు ఫొటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా, అమీషా పటేల్ వెకేషన్‌కు దుబాయ్‌కి వెళ్లింది. ఇక అక్కడ పలు చోట్ల తిరుగుతూ అక్కడి వాతావరణాన్ని ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె గాగుల్స్, ఓ క్యాప్ పెట్టుకుని కనిపించింది. ఓ ఫొటోలు మాత్రం బేబీబంప్‌తో ఉన్నట్లుగా కనిపించింది.

దానిని ఆమె చేతులతో కవర్ చేసినట్లు ఉంది. ఇక ఈ ఫొటో చూసిన వారంతా అమీషా పటేల్ తల్లికాబోతుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా, అమీషా పటేల్ 49 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే గతంలో ఆమె బడా వ్యపారవేత్త కనవ్ పూరితో డేటింగ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ వీరిద్దరు 2010లో ఏవో మనస్పర్థల కారణంగా విడిపోయారని టాక్. ఇక అప్పటి నుంచి అమీషా పటేల్ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. గతంలో ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చినప్పటికీ చేసుకోలేదు. ఇక ఇప్పుడు బేబీ బంప్‌తో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.



Next Story

Most Viewed