ఊహించని లుక్‌లో దర్శనమిచ్చిన పవర్ స్టార్ బ్యూటీ.. వైరల్‌గా మారిన ఫొటోలు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

by Hamsa |   ( Updated:2025-04-24 12:15:46.0  )
ఊహించని లుక్‌లో దర్శనమిచ్చిన పవర్ స్టార్ బ్యూటీ.. వైరల్‌గా మారిన ఫొటోలు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రజెంట్ ఈ అమ్మడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన నటించబోతుంది. హరిహర వీరమల్లు, ది రాజాసాబ్(The Rajasaab) వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో నిధి పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో పింక్ కలర్ చీర కట్టుకున్న ఆమె లూజ్ హెయిర్ వేసుకుని కనిపించింది. పూర్తిగా సంప్రదాయంగా ఉండటంతో ఇప్పటి హీరోయిన్లు అంతా ఆఫర్ల కోసం బాడీ పార్ట్స్ చూపిస్తుంటే.. నువ్వు ఇలా కనిపిస్తావని ఊహించలేదని అంటున్నారు. అలాగే చాలా అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed