స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. సో బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. సో బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పిస్తోంది. అంతేకాకుండా మెయిన్ లీడ్ ఉన్న పాత్రలు కూడా చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’, ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ నటనకు ఫుల్ మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం తన అంద చందాలతో వావ్ అనిపిస్తుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పిక్స్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అనన్య నాగళ్ల ఓ సినిమా ఈవెంట్‌లో చాలా క్యూట్ లుక్స్‌లో ఫొటోలకు పొజులిచ్చింది.

ఇక ఇందులో బ్లాక్ ఇన్నర్ వేర్ వేసుకుని పై నుంచి వైట్ కలర్ షర్ట్, ప్యాంట్ ధరించింది. అంతేకాకుండా దానికి బ్లాక్ కలర్ బెల్ట్ కూడా మ్యాచప్ చేసింది. చేతికి వాచ్, రెండు జడలు వేసుకుని స్టైలీష్ లుక్‌లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ ఫొటోస్‌పై మీరు ఓ లుక్ వేసేయండి.


Next Story

Most Viewed