Pawan Kalyan: యాక్షన్ మోడ్‌లో పవన్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Hamsa |
Pawan Kalyan: యాక్షన్ మోడ్‌లో పవన్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఈ సినిమా క్రిష్, జ్యోతికృష్ణ(Jyothikrishna) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్(Bobby Deol), నగ్రీస్ ఫక్రీ, నోరా ఫతేహి (Nora Fatehi)కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్స్‌లోకి రాబోతుంది.

గత కొద్ది రోజుల నుంచి పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఫైనల్ షెడ్యూల్(Final schedule) షూట్‌లో ఉన్నట్లు తెలుపుతూ స్క్రిప్ట్ చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Next Story