Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. ‘అబిర్ గులాల్’ మూవీ బ్యాన్ చేయాలని నెటిజన్ల డిమాండ్.. అసలు కారణం ఇదే!

by Hamsa |
Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. ‘అబిర్ గులాల్’ మూవీ బ్యాన్ చేయాలని నెటిజన్ల డిమాండ్.. అసలు కారణం ఇదే!
X

దిశ, సినిమా: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ బైసనన్ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనలో28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడం భారతదేశంలో సెగలు రేపుతోంది. ఇక ఈ విషయంపై సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు అలాగే ప్రతి భారతీయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జమ్మూ కాశ్మీర్ అందాలు చూడాలని వెళ్లిన అమాయకులపై దాడి చేయడం దారుణం అని సోషల్ మీడియాలో ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మతం అడిగిమరీ పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి కాల్చడం అత్యంత భాధాకరమని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. అసలు విషయాలు బయటపడకముందే ఓ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. ఫవర్ ఖాన్(Fawar Khan), వాణి కపూర్(Vaani Kapoor) జంటగా నటించిన ‘అబిర్ గులాల్’(Abir Gulal) సినిమాను థియేటర్స్‌లో ఓటీటీలో బ్యాన్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. ఆర్తి ఎస్ బాగ్ది (Arti S Bagdi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటికే అప్డేట్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అబిర్ గులాల్’ చిత్రం మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో బ్యాన్ చేయాలంటూ నెట్టింట పెద్ద రచ్చ జరుగుతోంది. అయితే దానికి కారణం ఏంటంటే.. ఇందులో హీరోగా నటించిన ఫవర్ ఖాన్ పాకిస్థాన్ చెందిన వాడని అందుకే విడుదలను అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు.

అసలు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేసిన సినిమాను చూడబోమని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫవర్ ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఆయనకు ఇక్కడ మంచి గుర్తింపు కూడా ఏర్పడింది. కానీ పహల్గాం ఉగ్రదాడి జరగడం వల్ల ఆ ఎఫెక్ట్ ‘అబిర్ గులాల్’ పడింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటరటైనర్‌ను రిలీజ్ చేయొద్దని కోరుతూ నెటిజన్లు హ్యాష్‌ట్యాగులతో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ స్పందిస్తే కానీ అసలు విషయాలు బయటపడవు.


Advertisement
Next Story

Most Viewed