Mahesh Babu: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. డైరెక్టర్ పోస్ట్‌కు మహేష్ బాబు రియాక్షన్

by Hamsa |
Mahesh Babu: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. డైరెక్టర్ పోస్ట్‌కు మహేష్ బాబు రియాక్షన్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ ‘SSMB-29’ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ‘SSMB-29’కు సంబంధించిన వార్తలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. నిత్యం నెట్టింట ఏదో ఒక న్యూస్ వస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, రాజమౌళి(Rajamouli) ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. సింహాన్ని లాక్ చేసినట్లుగా చూపించి మహేష్ బాబు పాస్‌పోర్ట్‌(Passport)తో ఫొటోకు పోజ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన మహేష్ బాబు(Mahesh Babu) ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అని రిప్లై ఇచ్చారు. ఇక స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఎమోజీలు షేర్ చేసింది. దీంతో ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.



Next Story