Ram Charan: మరోసారి రామ్ చరణ్- సుకుమార్ కాంబో ఫిక్స్.. హీరోయిన్ ఎవరో అస్సలు ఊహించి ఉండరు!

by Hamsa |
Ram Charan: మరోసారి రామ్ చరణ్- సుకుమార్ కాంబో ఫిక్స్.. హీరోయిన్ ఎవరో అస్సలు ఊహించి ఉండరు!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో సమంత(Samantha) హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, జగపతి బాబు(Jagapathi Babu), ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా.. 2018లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో రిపీట్ కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హిట్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ‘rc-17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna)ను హీరోయిన్‌గా తీసుకోవాలని సుకుమార్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇక ఈ స్టోరీ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ కాంబో వస్తుందని అస్సలు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్, రష్మిక కాంబోలో రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, రామ్ చరణ్ ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ‘rc-16’ చేస్తున్నారు. అయితే ఇందులో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story

Most Viewed