- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నువ్వే కావాలి’ సాంగ్ రిలీజ్.. 2025లో ఇదే టాప్ వన్ సాంగ్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (వీడియో)

దిశ, సినిమా: బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ దిల్ సే(Mahabub Dil Se), శ్రీ సత్య(Sri Satya) కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ ‘నువ్వే కావాలి’(Nuvve Kavali )సాంగ్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి(Suresh Banisetty) లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్ అన్ని తానై ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. అయితే దీనికి మనీష్ కుమార్(Manish Kumar) మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్‌లోని లోని బార్సిలోన, మెక్సికో(Mexico), పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో అందంగా చిత్రీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతూ రాయల్, ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు, క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. సిరి హనుమంత్ మాట్లాడుతూ.. మెహబూబ్ ది ముందు నుంచి కష్టపడే తత్వం. ఖాళీ దొరికితే ఏ వీడియో సాంగ్ చేయాలనే ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీ సత్య, మెహబూబ్ కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్ ని నాకు ముందే చూపించారు మంచి లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు.
ఈ సాంగ్ తో మెహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి మంచి మంచి పేరు తీసుకురావాలని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అనంతరం సోహెల్ మాట్లాడుతూ : మహబూబ్ నా దోస్త్. ఈ సాంగ్ ని చాలా కష్టపడి చేశాడు. శ్రీ సత్య, మెహబూబ్ పెయిర్ చాలా బాగుంది. భార్గవ్ పిక్చరైజేషన్, డైరెక్షన్, ఎడిటింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. మనీష్ అందించడం మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్ లిరిక్స్ లో మంచి ఫీల్ ఉంది. అందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక సాంగ్ వీడియోను విడుదల చేయగా అది చూసిన నెటిజన్లు 2025లో టాప్ వన్ సాంగ్ ఇదే.. సూపర్ లొకేషన్స్, డ్యాన్స్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.