పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. మా ఆయన లుంగీలో ఉండాలంటూ..(వీడియో)

by Kavitha |
పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. మా ఆయన లుంగీలో ఉండాలంటూ..(వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సరసన ‘దేవర’(Devara) మూవీలో నటించింది. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘RC-16’ మూవీలో నటిస్తోంది. దీనికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేకు మనవడైన శిఖర్ పహారియా(Shikhar Paharia)తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

వీళ్లిద్దరూ కలిసి వేకెషన్స్‌కి వెళ్లిన ఫొటోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ రిలేషన్ పై ఈ బ్యూటీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌లోని ఓ షోలో ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి డ్రీం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. నీ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే.. దానికి జాన్వీ స్పందిస్తూ.. “నేను పెళ్లి చేసుకొని తిరుమల తిరుపతిలో సెటిల్ అవ్వాలి. ముగ్గురు పిల్లలతో ఉండాలి. రోజూ అరటి ఆకుల్లో తినాలి.

రోజూ గోవిందా గోవిందా అని వింటూ ఉండాలి. మణిరత్నం సాంగ్స్ వినాలి. మా ఆయన లుంగీలో ఉండాలి. ఎందుకంటే అది చూడటానికి రొమాంటిక్‌గా ఉంటుంది" అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఇక ఈ అమ్మడు చేసిన కామెంట్స్‌కి ఆ షోలో ఉన్న హోస్ట్‌తో పాటు కరణ్ జోహార్ కూడా షాక్ అయ్యాడు. అసలు బాలీవుడ్ కల్చర్‌లో పెరిగిన జాన్వీ కపూర్ ఇలా పక్కా తెలుగమ్మాయిలా తన భర్త గురించి చెప్పడం, తిరుపతిలో సెటిల్ అవ్వాలని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాఖ్యలతో జాన్వీ తెలుగు ప్రేక్షకుల్లో మరింత రెస్పెక్ట్ తెచ్చుకుందనే చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed