- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అడవుల్లో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్.. హైప్ పెంచేస్తున్న న్యూస్

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక ఈ చిత్రంతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వీ గ్లోబల్ స్టార్ సరసన ‘ఆర్ సీ-16’(Rc-16) మూవీలో నటిస్తోంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వార్-2’(War-2) మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ఓ మూవీ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మార్చి నెలలో నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నాడట. అయితే యంగ్ టైగర్‌ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. అంతేకాకుండా అడవుల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం.
పైగా ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్(Ravi Basur) సంగీతం అందిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.