Nitin: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!

by sudharani |
Nitin: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్ (Nitin) నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నాడు. ఇక డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబోలో వచ్చిన ‘MCA, వకీల్ సాబ్ (Vakil Saab)’ సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న నితిన్ ‘తమ్ముడు’ చిత్రంపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ (High Expectations) నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ ప్రెస్టేజియస్ మూవీ (prestigious movie)ని మహాశివరాత్రి (Mahashivratri) పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ కాలేదు. కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సమ్మర్ స్పెషల్‌ (Summer special)గా ‘తమ్ముడు’ చిత్రం మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. కాగా.. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ మూవీలో సీరియర్ నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది.



Next Story

Most Viewed