స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన నితిన్, శ్రీలీల.. వావ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్(వీడియో)

by Kavitha |   ( Updated:2025-03-16 11:19:12.0  )
స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన నితిన్, శ్రీలీల.. వావ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. శనివారం ఈ మూవీ నుంచి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లుక్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్(ISTS) కాలేజీని సందర్శించి తమ సినిమా గురించి విద్యార్థులతో మాట్లాడింది.

అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్‌తో నితిన్, శ్రీలీల కలిసి ‘వేరెవర్ యు గో’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పంచుకోవడంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ చాలా బాగా డ్యాన్స్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed