Nidhi Agarwal: ఆ బ్యాచ్ కాదంటూ నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్..!

by Anjali |
Nidhi Agarwal: ఆ  బ్యాచ్ కాదంటూ నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సవ్యసాచి(Savyasachi) మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల వద్ద మార్కులు కొట్టేసింది. తర్వాత మజ్ను(Majnu) వంటి పలు సినిమాల్లో అవకావం కొట్టేసి టాలీవుడ్ పరిశ్రమలో మరింత క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అగ్ర హీరోల సరసన నటిస్తోంది.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Powerstar Pawan Kalyan) సరసన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) మూవీలో నటిస్తుంది. దీంతోపాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Pan India star Prabhas)కు జోడిగా ‘ది రాజాసాబ్’ (The RajasabThe Rajasab) చిత్రంలో మెరవనుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఎక్స్ వేదికన తమ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఓ ఫ్యాన్ ప్రభాస్‌తో మీరు నటిస్తోన్న సినిమాలో ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అని అడగ్గా.. హా బోలెడన్నీ ఉన్నాయన్నాయని తెలిపింది. మూవీ టీమ్ మేకింగ్ వీడియోలు(Making videos) కూడా విడుదల చేస్తుంది కావచ్చని వెల్లడించింది.

రెబల్‌స్టార్‌(Rebelstar)తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందని.. అంతా ఈ హీరోను ఎందుకు డార్లింగ్(Darling) అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది. అలాగే పవన్ కల్యాణ్ గురించి చెబుతూ.. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పలేమండి.. రియల్లీ గ్రేట్ పర్సన్ అని, లెజెండ్(Legend), పవర్‌పుల్ కళ్లు.. జాలి, దయ కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. తో సెల్ఫీ దిగాను త్వరలోనే పోస్ట్ చేస్తానని పేర్కొంది. హరిహర వీరమల్లులో తను పంచమి(Panchami)గా యాక్ట్ చేశానని.. లవ్ స్టోరీ చాలా బాగుంటుందని వెల్లడించింది.

మీరు అనుకున్న తేదీ కంటే ముందే థియేటర్లలో సందడి చేయనుందని పేర్కొంది. అలాగే హర్రర్ సినిమాల(Horror movies) గురించి అడగ్గా.. ఆ మూవీస్ అంటే భయమని తెలిపింది. తోడు ఎవరైనా ఉంటే చూస్తానని.. రాజాసాబ్ చిత్రం చూడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో రండి కలిసి చూద్దామని తెలిపింది. అలాగే నిధి ప్రశాంతతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పుకొచ్చింది. మీరు తెలుగు మాట్లాడుతారా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. వస్తుంది. అందులో డౌట్ ఏముందండి.. కానీ అందరికీ నమస్కారం అంటూ చెప్పే బ్యాచ్ నేను కాదని నిధి అగర్వాల్ బదులిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed