- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సైఫ్ గాయాలతో ఇబ్బంది పడినా కరీనా సాయం చేయలేదా? స్టార్ హీరో భార్య సెన్సేషనల్ పోస్ట్

దిశ, సినిమా: జనవరి 16న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఓ దుండగుడు దాడికి పాల్పడి విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స చేయించారు. సైఫ్‌కు సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ కూడా చేశారు. అయితే జనవరి 21న సైఫ్‌ను డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor) ఆయనను పట్టించుకోలేదని పలు పుకార్లు వచ్చాయి.
తాజాగా, ఈ విషయంపై స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) భార్య ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) స్పందించింది. భార్యలను నిందించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒక నటుడిపై కత్తితో దాడి చేసిన తర్వాత అతని భార్య ఇంట్లో లేదని లేదా దాడి సమయంలో అతనికి సహాయం చేయలేనంత మత్తులో ఉందని హాస్యాస్పదమైన పుకార్లు వ్యాపించాయి. ప్రజలు నిందలను భార్యపైకి మార్చడాన్ని ఆనందించారు. బీటిల్స్ విడిపోయినప్పుడు, ప్రజలు యోకో ఒనోను నిందించారు. విరాట్ కోహ్లీ ఔట్ కాగానే అనుష్కను నిందించి పలు కామెంట్లు చేశారు. ఇది ప్రజల దృష్టిలో జంటలకే పరిమితం కాకుండా విస్తృతమైన సమస్యగా మారింది.
భర్త చాలా బరువు పెరిగితే, మీరు అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం లేదని భార్యనే అంటారు. ఒకవేళ భర్త సన్నబడితే అతనిపై శ్రద్ధ వహించడం లేదని బ్లేమ్ చేస్తారు. అయితే గత వారం, నేను ఒక చిన్న కుటుంబ సమావేశానికి హాజరయ్యాను. అక్కడ బంధువులలో ఒకరు ‘చూడండి, నా ఐదుగురు మామయ్యలు బట్టతలతో ఉన్నారు. ఇంకా జుట్టు ఉన్నవాడు మాత్రమే పెళ్లి చేసుకోలేదు’ అని వ్యాఖ్యానించాడు. పెళ్లైన వారిలో బట్టతల రావడానికి కారణం భార్యలే అని కూడా నిందిస్తారు. ప్రతి పురుషుడు, ఓడిపోయినప్పుడు భార్యలను అనకండి’’ అని ఫైర్ అయింది.