Sree Vishnu: శ్రీవిష్ణు SV18 టైటిల్ గ్లింప్స్ రేపే.. కానీ చిన్న ట్విస్ట్

by sudharani |
Sree Vishnu: శ్రీవిష్ణు SV18 టైటిల్ గ్లింప్స్ రేపే.. కానీ చిన్న ట్విస్ట్
X

దిశ, సినిమా: హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రజెంట్ ‘నిను వీడిని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ‘SV18’ అనే వర్కిగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్‌తో కలిసి కళ్యా ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇక ఇటీవల శ్రీవిష్ణు బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి SV18పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘SV18’కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రేపు రిలీజ్ చేస్తున్నట్టు చెప్తూనే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఈ మేరకు ‘కుర్రోళ్లు.. కింగ్ ఎంటర్‌టైన్మెంట్ తిరిగి వచ్చింది! రేపు థియేటర్లలో తండేల్‌తో అత్యంత చమత్కారమైన అండ్ అత్యంత క్రేజీ #SV18 టైటిల్ గ్లింప్స్ చూడండి.. ఫన్ పేలుడు లోడ్ అవుతోంది’ అనే క్యాప్షన్ ఇచ్చి శ్రీ విష్ణు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా రేపు అనగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed