RGV Aaradhyadevi: RGV ఆరాధ్యదేవి బోల్డ్ లుక్‌పై నెటిజన్లు హాట్ కామెంట్స్

by sudharani |
RGV Aaradhyadevi: RGV ఆరాధ్యదేవి బోల్డ్ లుక్‌పై నెటిజన్లు హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇన్‌స్టా రీల్స్‌లో తన అందం, చీర కట్టుతో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది శ్రీలక్ష్మీ సతీష్ (Srilakshmi Satish). ఈ అమ్మడు ఫొటో షూట్‌లకు ఫ్లాట్ అయిపోయిన ఆర్‌జీవి (RGV) తనకు ఆరాధ్యదేవి అని నామకరణం చెయ్యడంతో పాటు ఆమెను వెండితెర (silver screen)కు కూడా పరిచయం చేస్తున్నాడు. త్వరలో ఈ ఆరాధ్య దేవి (Aaradhyadevi) ‘శారీ’ (Shaari) సినిమాతో బిగ్ స్ర్కీన్‌‌పై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్‌లో LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ అప్‌డేట్ ‘శారీ’ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.

భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మార్చి 21న విడుదల కానున్నట్లు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు వర్మ. ఇక సినిమా ప్రమోషన్స్‌ (Promotions)లో భాగంగా.. సోషల్ మీడియా (Social media)లో జోరు పెంచింది ఆరాధ్యదేవి. తన అందచందాలతో యూత్‌ను ఎట్రాక్ట్ చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే తాజాగా బోల్డ్ ఫొటో షూట్‌ (Bold photo shoot)తో దర్శనమిచ్చి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో బోల్డ్ కామెంట్స్‌ (Bold comments)తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed