Priyadarshi : నటుడు ప్రియదర్శిపై నెటిజన్స్ ఘాటు వ్యాఖ్యలు

by M.Rajitha |
Priyadarshi : నటుడు ప్రియదర్శిపై నెటిజన్స్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగులో ప్రతిభ కలిగిన నటుల్లో ప్రియదర్శి(Priyadarshi) ఒకరు. మల్లేశం, బలగం, జాతి రత్నాలు వంటి సూపర్ హిట్ సినిమాల్లో దర్శి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక హాస్యప్రధాన సినిమాల్లోనూ దర్శికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నటున్ని నెటిజన్స్(Netizens) కూరలో కరివేపాకు, పానకంలో పుడక అని ఘాటు కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తాజాగా డైరెక్టర్ శంకర్(Director Shankar), రామ్ చరణ్(Ram Charan) కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో ప్రియదర్శి కూడా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో దర్శి కేవలం ప్రెజెన్స్ లో ఉన్నాడు గాని ఒక్క డైలాగ్ కూడా లేదు. అంత ప్రతిభ కలిగిన నటుడికి సినిమా మొత్తంలో కనీసం ఒక్క డైలాగ్ ఇవ్వకపోవడంపై డైరెక్టర్ శంకర్ పై తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. మరోవైపు సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా.. కూరలో 'కరివేపాకు అయ్యవా బ్రో'.. 'పానకంలో పుడకలా మిగిలిపోయాడు' అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై ప్రియదర్శి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Next Story

Most Viewed