అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. సో ఎలిగెంట్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. సో ఎలిగెంట్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: ‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth) సరసన ‘పేట’(Peta) మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన అన్ని చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే రీసెంట్‌గా ‘తంగలాన్’(Thangalan) సినిమాతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్‌(Riddi Kumar)లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు.

సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ్ ఖేర్(anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తున్న యంగ్ బ్యూటీ మాళవిక.. తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లెహంగా వేసుకుని ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో ఎలిగెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్టుపై ఓ లుక్ వేసేయండి.



Next Story

Most Viewed