శ్రీలీల 20 సినిమాలు చేసింది నువ్వు ఏం చేశావంటూ నెటిజన్ పోస్ట్.. గట్టిగా ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ ! (ట్వీట్)

by Hamsa |
శ్రీలీల 20 సినిమాలు చేసింది నువ్వు ఏం చేశావంటూ నెటిజన్ పోస్ట్.. గట్టిగా ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ ! (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal)'‘సవ్యసాచి’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ భామ తెలుగులో పలు ప్రాజెక్ట్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఫేమ్ పెంచుకుంది. ఇక 2022లో ‘హీరో’ చిత్రం తర్వాత రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రజెంట్ ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటిస్తున్న ‘ది రాజాసాబ్’(The Rajasaab) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరి హరి వీరమల్లు’ సినిమాలోనూ కనిపించనుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో.. నిధి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు అప్డేట్స్ షేర్ చేస్తోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, నిధి అగర్వాల్‌‌ను శ్రీలీలతో పోలుస్తూ ఓ నెటిజన్ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఇక అది చూసిన ఈ భామ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ‘‘మంచి స్క్రిప్ట్‌లు అనుకున్నాను కాబట్టేజజ ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ.. తమిళంలో మూడు సినిమాలు ‘హరిహర వీరమల్లు’వంటి వాటికి సంతకం చేశాను. అందుకోసం కాస్త సమయం తీసుకుంటున్నా. అయితే కొన్నిసార్లు నా నిర్ణయం తప్పు అయి ఉండొచ్చు కానీ మంచి సినిమాల్లోనే నటించాలనేది నా కోరిక. వరుస ప్రాజెక్ట్స్ చేసేయాలనే తొందర నాకు ఏమీ లేదు. ఈ ఇండస్ట్రీలోనే నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వు ఏం బాధపడకు ఇలాంటి పోస్టులు పెట్టకు’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం నిధి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే గట్టిగా ఇచ్చిపడేసిందిగా అని అంటున్నారు.



Next Story

Most Viewed