- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Neha Shetty: చేతిలో వాటితో దర్శనమిచ్చిన టిల్లు బ్యూటీ.. నెట్టింట వైరలవుతోన్న ఫొటోలు !

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో తెలుగులో ఫుల్ పాపులరిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీలో ఆకాశ్ (Akash) కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించార ఇండియా(India)-పాక్ (Pakistan) బోర్డర్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ (love story) గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం కాలంలో మరణించిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో జన్మించడం అనే స్టోరీతో దర్శకుడు రూపొందించాడు. ముఖ్యంగా ఈ మూవీ పూరి జగన్నాథ్ సొంత బ్యానర్‌లో నిర్మించడం విశేషం. తర్వాత ఈ బ్యూటీ డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణ(Presented by Pdv Prasad)లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ (Sithara Entertainments Banners) పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) నిర్మించారు.
అలాగే డీజే టిల్లు కు విమల్ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda), ప్రిన్స్ సిసిల్(Prince Cecil), నేహాశెట్టి, బ్రహ్మాజీ(Brahmaji), నర్రా శ్రీనివాస్(Narra Srinivas), ప్రగతి(Pragati), వంటి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించి జనాల్ని తమ అద్భుతమైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. అనంతరం నేహా శెట్టి బెదురులంక(Bedurulanka), 'రూల్స్ రంజన్(Rules Ranjan), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari), గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor), టిల్లు స్క్వేర్ (Tillu Square) వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా ముంగారు మగ 2 (Mungaru maga)అనే కన్నడ సినిమాలోనే కూడా నటించి అక్కడి ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌గ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. స్టైలిష్ డ్రెస్ ధరించి.. చేతిలో పువ్వులతో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ఈ పోస్ట్ కు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ఈ పూలు నేను కొనగలను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.