- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
NC-24: నిశ్శబ్దం ఏదో చూస్తోంది.. యువ సామ్రాట్ కెరీర్‌లోనే అత్యుత్తమ లుక్స్ రాబోతుందంటూ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న క్రమంలో తాజాగా దీపక్ సోమిశెట్టి ఈ మూవీకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘నిశ్శబ్దంలో, ఏదో చూస్తోంది.. #NC24 అప్‌డేట్ తర్వలో రాబోతుంది.. యువసామ్రాట్ నాగ చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ లుక్స్ రాబోతున్నాయి’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.