Nayanathara: విఘ్నేష్‌‌‌ను పెళ్ళి చేసుకోకుంటే బాగుండేది.. దుమారం రేపుతున్న నయన్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-12-14 09:20:12.0  )
Nayanathara: విఘ్నేష్‌‌‌ను పెళ్ళి చేసుకోకుంటే బాగుండేది.. దుమారం రేపుతున్న నయన్ కామెంట్స్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా తన సత్తా చాటింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది. ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే సరోగసి ద్వారా ఈ జంట ఇద్దరు బాబులకు పేరెంట్స్ కూడా అయ్యారు. ప్రస్తుతం ఈ భామ ఓ పక్కా సినిమాలు, మరోపక్క తన భర్త, పిల్లలతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్.. తన భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నా కారణంగా విగ్నేష్ ప్రతిభను గుర్తించడం లేదు. నేను ఆయన జీవితంలో లేకపోతే డైరెక్టర్, రచయిత, గేయ రచయితగా ఆయనకు గుర్తింపు దక్కేది. ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కోసారి విగ్నేష్‌ను పెళ్లి చేసుకోకుంటే బాగుండేదని అనిపిస్తుంది. వివాహబంధం లోకి ఆయనను లాగినందుకు అప్పుడప్పుడు గిల్టీగా ఫీలవుతున్నాను.

విగ్నేష్ చాలా మంచి మనిషి. మనసున్న వ్యక్తి. తనకు కూడా మంచితనం ఉంది. కానీ, ఆయనంత మంచితనం నాలో లేదు. మా రిలేషన్ కోసం మొదటి అడుగు నేనే వేశాను. ఇక కెరీర్ పరంగా నేను విఘ్నేష్ కంటే సీనియర్. అతను నా కన్న చాలా ఆలస్యంగా కెరీర్ ప్రారంభించారు. అయితే నేను నా కెరీర్‌లో సక్సెస్ అయ్యాను. కానీ, విగ్నేష్ తన స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు” అని నయన్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed