- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Nani :నాని ‘ది ప్యారడైజ్’పై సూపర్ న్యూస్.. ఎనిమిది భాషల్లో రిలీజ్ కాబోతున్న టీజర్

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఒకటి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) సినిమాకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు వస్తున్న ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ టీజర్(teaser)పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది. ‘ది ప్యారడైజ్’ టీజర్ మార్చి 3న రాబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. ఈ టీజర్‌ను ఏకంగా ఎనిమిది భాషల్లో (eight languages) (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ టీజర్‌కు మూడు రోజులే టైమ్ ఉండటంతో ఈలోపు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమచారం. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈగర్‌గా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్.