- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hit-3: హిట్-3 నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చిన నాని.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సినిమా ‘హిట్-3’ (Hit-3). బ్లాక్ బస్టర్ మూవీ ‘హిట్’ (Hit)కు సీక్వెల్(Sequel)గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సమ్మర్ స్పెషల్(Summer Special)గా మే 1న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం ‘హిట్-3’ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ రాబోతుంది అని తెలుపుతూ నాని ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ‘మా టీమ్ ఈ పాట ప్లేస్‌మెంట్‌కు ఒక పేరు పెట్టారు. ‘ది చిల్ బిఫోర్ ది స్టార్మ్’.. ప్రేమవెల్లువ మార్చి 24న విడుదల కాబోతుంది’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో నాని చేతులు కట్టుకుని హీరోయిన్ శ్రీనిధి శెట్టిని క్యూట్‌గా చూస్తుండగా.. శ్రీనిధి నాని వైపు చూస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ (Poster) ఆకట్టుకుంటోంది.