- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nagachaitanya: క్యూట్ వీడియో షేర్ చేసిన నాగ చైతన్య.. సూపర్ అంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు అతని ఖాతాలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైన మంచి హిట్ సాధించాలనే తపనతో రీసెంట్‌గా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’ (thandel) అనే మూవీతో మనముందుకు వచ్చాడు. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu)నిర్మించారు.
ఇక ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంత(Samantha)తో విడాకుల తర్వాత చైతన్య.. స్టార్ హీరోయిన్ శోభిత ధూలిపాళతో డేటింగ్ చేశాడు. అనంతరం ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. ఇక గత ఏడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి అఫీషియల్‌గా భార్య బర్తలయిన వీరు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఎక్కడికి వెళ్లిన జంటగా వెళ్లి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ వావ్ అనిపిస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అతను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. అందులో బ్లూ టీషర్ట్, వైట్ క్యాజువల్ ప్యాంట్ ధరించి చాలా నేచురల్ లుక్‌లో కనిపించాడు. అలాగే మంచం మీద పడుకొని, ఇంటి బయట నిలబడి, క్యూట్ స్మైల్ ఇస్తూ వాగ్యూ కవర్ పేజ్‌కి పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సూపర్ ఉన్నారు మీరు నవ్వితే అంటూ కామెంట్స్ చేస్తున్నారు
Read More..
ఆ పార్ట్‌కు రూ.2.4కోట్ల డైమండ్ ధరించిన గ్లోబల్ క్వీన్.. మేడం చాలా రిచ్ గురూ అంటున్న నెటిజన్లు