- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Naresh-Pavitra: మళ్లీ వార్తల్లోకి పవిత్ర-నరేష్.. ఆమె వచ్చాకే నా జీవితం ఇలా అయిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) గతంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. 2023లో వీరిద్దరు ప్రేమించుకుని అందరినీ షాక్ గురి చేశారు. అయితే ఆయన మూడో భార్య మాత్రం తన భర్త తనకు కావాలని కోర్టు వరకు వెళ్లడంతో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఇక 2023 మార్చి 1 నరేష్- పవిత్రలు పెళ్లి చేసుకున్న వీడియోను షేర్ చేసి అందరి ఆశీస్సులు కోరుకుంటున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇక నరేష్,పవిత్ర హానీమూన్(Honeymoon)కు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అంతా సర్దుమనగడంతో ఆయన మూడో భార్య కూడా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇన్ని రోజులకు నరేష్ సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఏకంగా 9 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో.. తాజాగా, ఆయన 52వ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవిత్ర వచ్చాక జీవితం ఎలా ఉందనే ప్రశ్న ఎదురవగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘పవిత్ర నాకు గిఫ్ట్‌గా నేను వేసుకున్న షర్ట్ ఇచ్చింది. ఆమె రాకతో నా జీవితంలోకి టైటానిక్(Titanic) ఒడ్డుకు చేరినట్లుగా అయింది.
నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది. నేను పవిత్ర, నా గురించి మాట్లాడటం లేదు. షిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాల్లు ఎమోషనల్‌గా ఉంటారు. అలాగే మేమే కమిట్‌మెంట్‌తో ఉండి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, భార్యతలో సమయం గడపడటం చాలా కష్టమైనది. మేము కూడా మనుషులం కాబట్టి అవతల ఇవతల చాలా కష్టపడాలి. కానీ మనల్ని అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే వాళ్లు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే జీవితం టైటానిక్ జాగ్రత్తగా షోరూమ్‌కు పోతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.