- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎం.ఎస్ ధోని న్యూ యాడ్.. సినిమా రేంజ్‌లో ఉందంటున్న ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్: రణ్‌బీర్ కపూర్(Ranbeer Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన ‘యానిమల్’(Animal) సినిమా ఎంతగా విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే కంటెంట్ పరంగా ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొంది. ఆడవారిని చాలా తక్కువగా చేసి చూపించారని డైరెక్టర్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(M.S Dhoni) యానిమల్ సినిమాలో రణ్‌బీర్ పాత్రలో నటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. దీనికి కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించాడు. అయితే ధోని నటించింది సినిమాలో అనుకుంటే పొరపాటు పడినట్టే.. ఎందుకంటే ఆయన యాక్ట్ చేసింది ఒక వాణిజ్య ప్రకటనలో. ఐపీఎల్ -2025 మార్చి 22న అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీంతో వివిధ కంపెనీలు క్రికెటర్లతో పోటీ పడి మరీ యాడ్స్ తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ధోని యానిమల్ మూవీ తరహాలో ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించాడు.
ఇక వీడియోలో.. ‘యానిమల్’ చిత్రం తరహాలోనే ఎలక్ట్రిక్ సైకిల్ ప్రకటనలో ధోని నటించారు. ఈ సినిమాలోని బాగా హైలెట్ సన్నివేశాలను ఈ ప్రకటనలో రీ క్రియేట్ చేశారు. అలా ధోని పొడవాటి జుట్టు, సినిమాలో రణ్ బీర్ వేసుకున్న దుస్తులనే ధరించాడు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తన బావమరిదిని చంపడానికి తన గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్తాడు. అలాగే ప్రారంభంలో రష్మిక మందన్నాను కలవడానికి బైక్‌పై స్టైల్‌గా వస్తాడు. అయితే ఈ యాడ్‌లో మాత్రం ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌పై వస్తాడు. ఇక చివరి సన్నివేశంలో కూడా రణ్ బీర్ లాగే ధోని కూడా ఓ బోల్డ్ సైన్ ఇస్తాడు. ఈ ప్రకటనలో సందీప్ రెడ్డి వంగా కూడా నటించడం విశేషం. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన ధోనీ ఫ్యాన్స్ యాడ్ సినిమా రేంజ్‌లో ఉందని కామెంట్లు చేస్తున్నారు.