Mrunal Thakur: క్రేజీ సీక్వెల్‌‌తో రాబోతున్న మృణాల్.. స్టార్ హీరో సరసన గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందిగా!

by Hamsa |
Mrunal Thakur: క్రేజీ సీక్వెల్‌‌తో రాబోతున్న మృణాల్.. స్టార్ హీరో సరసన గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మృణాల్ ‘హాయ్ నాన్న’(Hi Nanna ) తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) మూవీలో నటించింది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఇటీవల ‘కల్కి’(Kalki)లో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు అడివిశేష్(Adivi Sesh) సరసన ‘డెకాయిట్’(Dacoit) మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఓ క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అజయ్ దేవగణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘సన్ ఆఫ్ సర్దార్’(Son of Sardar) సీక్వెల్‌లో ఈ భామ నటించనున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో నటించిన సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ప్లేస్‌లో మృణాల్‌ను తీసుకోనున్నట్లు టాక్.

ఇప్పటికే బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు అజయ్‌తో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్లు టాక్. ‘సన్ ఆఫ్ సర్దార్-2’ కథను మేకర్స్ కామెడీ, ట్విస్ట్‌లతో మిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విజయ్ కుమార్ అరోరా(Vijay Kumar Arora) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో జ్యోతి దేశ్‌పాండే, ప్రవీణ్ తల్రేజా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ జూలై 25న విడుదల కాబోతున్నట్లు సమాచారం.



Next Story