Monalisa:టాలీవుడ్ హీరోతో మోనాలిసా.. ఆ ఫొటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2025-02-03 08:12:55.0  )
Monalisa:టాలీవుడ్ హీరోతో మోనాలిసా.. ఆ ఫొటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభామేళా(Mahakumbh Mela) కోలాహలంగా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు(Devotees) భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని ఇండోర్‌(Indore)కి చెందిన మోనాలిసా అనే యువతి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె కుంభామేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

దీంతో కొందరు యూట్యూబర్‌లు మోనాలిసా(Monalisa)ను ఫొటోలు(Photo), వీడియో(video)లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ తరుణంలో ఆమె ఓవర్‌నైట్ లోనే స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలే కనిపించాయి. ఇంకేముంది ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన మోనాలిసా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల ఈ కుంభమేళా బ్యూటీకి బాలీవుడ్‌(Bollywood)లో సినిమా ఆఫర్(Movie Offer) కూడా వచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మోనాలిసా న్యూ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 మూవీ(Pushpa 2 Movie) పోస్టర్ ముందు కుంభమేళా బ్యూటీ మోనాలిసా దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీలో నటించనుంది. ‘‘ఇప్పుడు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం’’ అంటూ ఆమె ట్విట్టర్‌లో చెప్పుకొచ్చింది. మోనాలిసా పోస్ట్‌ పెట్టడంతో ఇక సినిమాల్లో నటించబోయేది నిజమే అని కొందరూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మోనాలిసా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప-2 ది రూల్ మూవీ పోస్టర్ ముందు దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed