- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi: బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్లో చిరు స్టన్నింగ్ ఫొటో షూట్.. యంగ్ లుక్ వైరల్
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన నటన, అద్భుతమైన డ్యాన్స్ గురించైతే చెప్పనవసరమే లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. చిరు అద్భుతమైన నటనకు ఇటీవలే ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) కూడా అందించింది. ప్రస్తుతం ఈ హీరో వశిష్ట(Vashiṣṭa) దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పోస్టర్లు విడుదలై జనాల్లో భారీ హైప్ పెంచాయి. నెక్ట్స్ మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్స్లో చిరు యంగ్ లుక్ను తలపిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్లో మెగాస్టార్ ఓల్డ్ డేస్ను గుర్తు తెస్తున్నారు. అంతేకాకుండా చిరు బ్లాక్ కలర్ గ్లాసెస్ ధరించి.. హెయిర్ స్టైయిల్ సైతం మార్చేశారు. ఫుల్ జోష్తో ఎనర్జిటిక్తో మెగాస్టార్ చేసిన ఫొటో షూట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవ్వగా.. సడన్గా చూసి రామ్ చరణ్(Ram Charan) అనుకున్నామంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు.