- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Chiranjeevi: ఆ సమయంలో చాలా భయమేసింది.. ‘జీబ్రా’ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జీబ్రా సినిమా(Zebra Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ‘కరోనా సమయంలో అంతా ఓటీటీకి అలవాటుపడ్డారు. పెద్ద సినిమాలకే జనాలు వస్తారని విన్నప్పుడు భయమేసింది. చిన్న సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో ఆ భయం పోయింది. సినిమా ఆడలేదంటే కంటెంట్ లేకపోవడమే.
ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందించాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమాలు ఆడాలి’ అని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. యాక్షన్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యువ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. పుష్ప ఫేం ధనంజయ(జాలిరెడ్డి) కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.