Vishwak Sen: ‘లైలా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో.. ఇన్‌స్టా పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన విశ్వక్ సేన్

by Hamsa |   ( Updated:2025-02-07 10:10:54.0  )
Vishwak Sen: ‘లైలా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో.. ఇన్‌స్టా పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన విశ్వక్ సేన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో వచ్చి ఓ సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్, రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది.

అయితే రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల లైలా ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఎన్నడూ లేని విధంగా లేడీ గెటప్‌లో నటిస్తుండటంతో అందరిలో ‘లైలా’పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్‌తో కన్ఫర్మ్ చేశారు.

నిర్మాత సాహు గారపాటి, విశ్వక్ సేన్ చిరు ఇంటికి వెళ్లి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్లు వెల్లడించారు. ఆయనతో కాసేపు మాట్లాడి ఓ బహుమతి ఇవ్వడంతో పాటు పూల మాల వేశారు. ఇక ఈ ఫొటోలను విశ్వక్ షేర్ చేస్తూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వస్తానని చెప్పారు. మీ మద్దతును తెలుపుతున్నందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం విశ్వక్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారు ఎవ్వరైనా బాస్ దగ్గరికి రావాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed