‘ఛావా’ మూవీ రివ్యూ ఇచ్చిన మెగా హీరో.. నేను చాలా నేర్చుకున్నానంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |
‘ఛావా’ మూవీ రివ్యూ ఇచ్చిన మెగా హీరో.. నేను చాలా నేర్చుకున్నానంటూ ఇంట్రెస్టింగ్  ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). ఇందులో వీక్కి కౌశల్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పలు రికార్డులు కొల్లగొడుతూ ఊహించని విధంగా ‘ఛావా’ దూసుకుపోతుంది. అలాగే సినీ సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, మెగా హీరో అల్లు శిరీష్(Allu Sirish) ‘ఛావా’ మూవీపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘మనసుకు హత్తుకునే సినిమా! ముగింపు చూడటానికి చాలా బాధాకరంగా ఉంది.. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా గర్జించాడు! జీవితకాల ప్రదర్శన. అక్షయ్ ఖన్నా జీ, రష్మిక, అశుతోష్ రానా జీ, సహాయక తారాగణం అందరూ అద్భుతంగా నటించారు. ఈ పురాణ చిత్రాన్ని రూపొందించినందుకు. మన NCERT పాఠ్యపుస్తకాలు మన గొప్ప భారతీయ రాజుల గురించి చాలా చెప్పనప్పటికీ నేను సంతోషిస్తున్నాను. మేము వారి గురించి సినిమాల ద్వారా చాలా నేర్చుకుంటున్నాము’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాజిటివ్‌గానే చెప్పి శంభాజీ మహారాజ్ పుస్తకాలు కూడా తీసుకురావాలని కౌంటర్లు వేసాడని అంటున్నారు.

Next Story

Most Viewed