మీ హోలీ ఆనందం, ప్రేమ, రంగులతో నిండి ఉండనివ్వండి.. తెలుసు కదా నుంచి స్పెషల్ పోస్టర్

by Kavitha |
మీ హోలీ ఆనందం, ప్రేమ, రంగులతో నిండి ఉండనివ్వండి.. తెలుసు కదా నుంచి స్పెషల్ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) ప్రస్తుతం ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటిస్తున్నాడు. ఇక దీనికి నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహిస్తున్నది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(SS Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), రాశి ఖన్నా(Rashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నేడు హోలీ ఫెస్టివల్(Holi Festival) అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పండుగ స్పెషల్‌గా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ‘మీ హోలీ ఆనందం, ప్రేమ మరియు మంచి ఆరోగ్యం యొక్క ప్రకాశవంతమైన రంగులతో నిండి ఉండనివ్వండి’ అనే క్యాప్షన్ జోడించింది.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ ఉండగా.. రైట్ సైడ్ శ్రీనిధి శెట్టి, లెఫ్ట్ సైడ్ రాశి ఖన్నా రంగులు వెదజల్లుతూ కనిపించారు. మంచి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

కాగా సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో మరింత ఫేమ్ సంపాదించుకున్నాడు. దీంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ‘తెలుసు కదా’ సినిమాతో పాటు ‘జాక్ కొంచెం క్రాక్’(Jack Konchem Krack) మూవీలో కూడా నటిస్తున్నాడు.

Next Story

Most Viewed