Ravi Teja: స్టార్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా మూవీ.. ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న ట్వీట్

by Hamsa |
Ravi Teja: స్టార్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా మూవీ.. ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న ట్వీట్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు కానీ హిట్ అందుకోలేకపోయారు. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’(Mass Jathara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తుండగా శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పూ సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రవితేజ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా, రవితేజ ఓ స్టార్ డైరెక్టర్‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రవితేజ కాంబోలో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్నట్లు టాక్. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటించనుండగా.. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్‌పై చిన్నబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కానుకగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీరి కాంబోలో మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



Next Story