CM Revanth Reddy: సీఎంను కలిసిన మంచు విష్ణు.. ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్

by sudharani |
CM Revanth Reddy: సీఎంను కలిసిన మంచు విష్ణు.. ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్
X

దిశ, సినిమా: మంచు మెహన్ బాబు (Manchu Mehan Babu), మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. ఈ మేరకు ‘గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉంది. ఆయనను కలుసుకోవడం, అనేక ముఖ్యమైన అంశాలను చర్చించడం చాలా అద్భుతంగా ఉంది. మన రాష్ట్రం అండ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ వృద్ధికి ఆయన చూపిన అచంచలమైన మద్దతు అండ్ నిబద్ధతకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ముఖేక్ కుమార్ సింగ్ (Mukhek Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed