Manchu Family: ఆగని గొడవలు.. మంచు మనోజ్ మరో సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
Manchu Family: ఆగని గొడవలు.. మంచు మనోజ్ మరో సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి కలెక్టర్(Rangareddy Collector) నోటీసులకు సినీ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) వివరణ ఇచ్చారు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని అన్నారు. విద్యార్థులు, బంధువులు, కుటుంబం కోసమే తన పోరాటం అని వెల్లడించారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అడిగినందుకు మా అన్నయ్య నాటకాలు ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని కీలక ప్రకటన చేశారు. కాగా, గతకొంతకాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. స్వయానా తండ్రి మోహన్ బాబు(Mohan Babu)తో మనోజ్‌కు గొడవలు జరుగుతున్న కారణంగా.. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని(మనోజ్‌ను) ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్‌బాబు కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి కంప్లైంట్ చేశారు.

జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మంచు మనోజ్‌కు కలెక్టర్‌ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే తాజాగా రంగారెడ్డి కలెక్టర్‌కు మనోజ్ వివరణ ఇచ్చారు. మరోవైపు.. ఇటీవల సంక్రాంతి పండగను మోహన్ బాబు ఫ్యామిలీ తిరుపతిలో గ్రాండ్‌గా జరుపుకున్నది. తిరుపతిలో మోహన్ బాబు, విష్ణు(Manchu Vishnu) ఫ్యామిలీతో తమ యూనివర్సిటీలో సంక్రాంతి సెలబ్రేషన్స్(Sankranti Celebrations) చేసుకున్నారు. అయితే.. అక్కడకు కూడా వచ్చిన మనోజ్‌ను తన తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోతాను అని చెప్పినా అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మనోజ్‌కు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.



Next Story

Most Viewed