ఇక రెడీ అయిపోండి మామ.. ‘మ్యాడ్-స్క్వేర్’ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ (ట్వీట్)

by Hamsa |
ఇక రెడీ అయిపోండి మామ.. ‘మ్యాడ్-స్క్వేర్’ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్(Narne Nitin), సంగీత్ శోభన్(Sangeet Shobhan), రామ్ నితిన్(Ram Nitin) హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్-స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై హారిక, సూర్యదేవర, నాగవంశీ నిర్మిస్తున్నాయి. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో రెబ్బా మౌనిక జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో గౌరీప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్(Anantika Sunilkumar), గోపీకా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్(Muralidhar Goud), రఘు బాబు(Raghu Babu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ‘మ్యాడ్-స్క్వేర్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. షూటింగ్ కూడా 50 శాతం పూర్తి కావొస్తుండగా.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ‘మ్యాడ్-స్క్వేర్’ నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ చిత్రం మార్చి 29 థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రాబోతున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇక రెడీ అయిపోండి మామ.. థ్రిల్ కాబోతున్నారు’’ అనే క్యాప్షన్ జత చేసి ఫిబ్రవరి 25న రాబోతున్నట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed