- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మజాకా’ ట్రైలర్ రిలీజ్.. బాలయ్య బాబు ప్రసాదం కళ్లకద్దుకుని తాగాలంటూ తండ్రి కొడుకులు ఫుల్‌గా నవ్వించేశారుగా..

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan), యంగ్ బ్యూటీ రీతూ వర్మ(Ritu Varma) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka). స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinatharao Nakkina) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండ(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
అయితే మజాకా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాగా ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయింది. అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో పాటు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. నీ లాంటి కొడుకు భూమండలం మొత్తం వెతికినా దొరకడురా అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంంది. ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ వేరువేరు ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే వారి ప్రేమ, పెళ్లితో ఫుల్ లెంగ్త్ కామెడీగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
రైటర్ ప్రసన్న మార్క్ కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. చివర్లో హైపర్ ఆది(Hyper Aadi) మ్యాన్షన్ హౌస్ తీసుకొచ్చి బాలయ్య బాబు(Balayya Babu) ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య అనాలి అంటూ ట్రైలర్ ఆద్యంతం నవ్వించారు. దీంతో సినిమాలో కూడా తండ్రీకొడుకులు ఫుల్‌గా నవ్విస్తారని తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసేయండి. ఫుల్‌గా నవ్వేయండి.