Mahesh Babu-Rajamouli: ‘SSMB 29’ ఫస్ట్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. షూట్ జరిగేది ఎక్కడంటే? (ట్వీట్)

by Hamsa |
Mahesh Babu-Rajamouli: ‘SSMB 29’ ఫస్ట్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. షూట్ జరిగేది ఎక్కడంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో రాబోతున్న ‘SSMB-29’ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ‘ఎస్ఎస్ఎంబీ-29’ కోసం గత ఏడాది నుంచే మహేష్ బాబు సోషల్ మీడియాకు కూడా దూరం అయి పూర్తిగా తన మేకోవర్ మీదనే ఫోకస్ పెట్టారు. అయితే ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందించగా.. ఇందులో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల రాజమౌళి ఈ మూవీ షూట్ కోసం మహేష్ పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు సింహాన్ని బోన్‌లో వేసినట్లు పెట్టిన ఓ పోస్ట్ అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అయితే సినీ ప్రియులంతా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘SSMB-29’ ఫస్ట్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఇందుకోసం భారతదేశంలోని వారణాసిలో మణికర్ణిక ఘాట్ విజువల్స్‌ రీక్రియేట్ అయ్యేలా ఇక్కడే పుననిర్మించినట్లు సమాచారం. అయితే అక్కడ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్, అల్యూమీనియం ఫ్యాక్టరీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.



Next Story

Most Viewed