సుకుమార్ కూతురి సినిమాకు మహేష్ బాబు రివ్యూ.. ఎలా ఉందో తెలుసా?

by Gantepaka Srikanth |
సుకుమార్ కూతురి సినిమాకు మహేష్ బాబు రివ్యూ.. ఎలా ఉందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడాయన గురించి ఇండియా మొత్తం చర్చించుకుంటోంది. ఇటీవల ఆయన తెరకెక్కించిన పుష్ప-2 చిత్రం గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా రూ.1830 కోట్లకుపైగా కలెక్ట్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా.. సుకుమార్ కూతురు సుకృతి(Sukriti Sukumar) వెండితెరకు పరిచయం కాబోతోంది. ఆమె నటించిన గాంధీతాత చెట్టు సినిమా(Gandhi Tatha Chettu Movie) రేపు(24-01-2025) గ్రాండ్‌గా కాబోతోంది. అయితే ఇవాళ(23-01-2025) మీడియా కోసం ఈ సినిమా స్పెషల్‌ షో వేశారు.

ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. తొలి చిత్రంలోనే అద్భుతంగా నటించిన సుకుమార్ కూతురికి అన్నివర్గాల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సోషల్ మీడియా(X) వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఈ చిత్రం ఎప్పటికీ మనతో ఉండిపోతుంది. అహింస గురించి అద్భుతమైన కథను అందంగా చూపించారు. సుకృతి యాక్టింగ్‌ చూస్తే గర్వంగా అనిపించింది. అందరూ ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించండి’ అంటూ మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తబితా(సుకుమార్‌ భార్య), నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మించారు. భాను ప్రకాష్, ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్ వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు. గ్రామీణ వాతావరణంలో పచ్చదనం ప్రాముఖ్యత, అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసం, గాంధీ సిద్దాంతాలు అంశాలు ఆధారంగా రూపొందిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఎటువంటి హింస, రక్తపాతం లేకుండా ఆహ్తాదకరంగా సాగిపోయే ఈ సినిమాను అందరూ తమ పిల్లలతో కలిసి చూసే విధంగా ఉంటుందని ఇప్పటికే చూసిన వారంతా వారి వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

Next Story